Wednesday, April 27, 2011

సినిమా థియేటర్లో జాతీయగీతం


మొన్నామధ్య మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి వెళ్ళాను. ప్రారంభానికి ముందు వేసే యాడ్స్ అన్నీ అయిపోయాక ఒక స్లైడ్ పడింది. జాతీయగీతం వస్తోంది లేచి నిలబడండి అని. ఒక్కసారిగా ప్రేక్షకులందరూ లేచి నిలబడ్డారు. పిన్ డ్రాప్ సైలెన్స్. కేవలం మ్యూజిక్ నేపథ్యంలో మానసిక, అంగ వైకల్యం ఉన్నవారిపై జాతీయ గీతాన్ని చిత్రీకరించారు. చాలా చాలా గొప్పగా ఉంది. అయిపోతూనే చాలాసేపు ఈలలు కేకలు మారు మోగాయి. నాకైతే కళ్ళల్లో నీళ్ళు నిండాయి.


అన్ని వర్గాల వారు వచ్చే సినిమా థియేటర్లలో జాతీయ గీతం చూపడం గొప్ప కాన్సెప్ట్ అనిపించింది. ఇది కేవలం రిలయన్స్ బిగ్ సినిమాల్లో ఉందని మిత్రులు చెప్పారు. దీన్ని అన్ని చోట్లా అమలు పరిస్తే బావుంటుంది.    11 comments:

 1. మహారాష్ట్ర లో తప్పని సరేమో తెలీదుకానండి నేను కొల్హాపూర్ లో చూసిన ప్రతీ సినిమాకి , ప్రతి థియేటర్ లోనూ జాతీయగీతం వేసారు.

  జాతీయగీతం తెరపై నేనెప్పుడో నా చిన్నప్పుడు మా ఊళ్ళో (రావులపాలెం లో ) ఒక సారి చూసాను, తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ..

  అన్ని థియేటర్లలో తప్పని సరి చెయ్యక పోయినా , కనీసం భారీ బడ్జెట్ సినిమాలకు ఈ పద్దతి అవలంభిస్తే బావుంటుంది కదండి .


  మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ ..

  ReplyDelete
 2. ఎందుకు బాబూ. కొన్నాళ్ళపాటు తణుకులో ఇలాగే నేను లేచి నుంచిని పిచ్చి సన్నాసిని అయ్యాను. ప్రతి ఒక్క మహానుభావుడూ వచ్చి నేను నుంచొనుండగానే నాకు క్లాస్ పీకాడు.

  ReplyDelete
 3. It is mandatory in Maharashtra to show National anthem (Jana gana mana) before movie.

  ReplyDelete
 4. పూర్వము అన్ని సినిమాలు ముందు జాతీయ గీతం వేసేవారట! కానీ ఇప్పుడు మహారాష్ట్ర లో ఇప్పటికి ఏ సినిమా ముందు అయినా జాతీయ గీతం వేస్తారు ....ఇది మంచి సంప్రదాయం ..కనీసం కొంతమందికి ఇలా అయినా దేశభక్తీ కలుగుతుందేమో ...

  http://sairamysr.blogspot.com/

  ReplyDelete
 5. మీరు చూసింది ఇదేనా?
  http://blogavadgeetha.blogspot.com/2011/01/blog-post_27.html

  ReplyDelete
 6. అందరికీ ధన్యవాదాలు.
  మహారాష్ట్రలో తప్పని సరి అన్న విషయం నాకు తెలీదు.
  శంకర్ గారూ అదే నేను చూసింది.
  మినర్వా గారూ నిజం చెప్పాలంటే... నాకూ వెంటనే అనిపించింది. అందరూ లేచి నిలబడతారా అని... కానీ అందరూ నిలబడ్డారు. కొద్ది రోజులు పోతే అలవాటు కావచ్చేమో. నిజానికి ప్రపంచ కప్ పుణ్యమాని దేశ భక్తి జ్వరం ఇంకా మనవాళ్ళలో ఉంది. అది కూడా ఒక కారణం కావచ్చు.

  ReplyDelete
 7. మా చిన్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత జాతీయగీతం వేసేవారు.చాలామంది నిలబడకుండా వెళ్ళిపోయేవారు.అలా జాతీయగీతం అగౌరవ పడడం ఇష్టంలేక తీసివేసారనుకుంటా.

  ReplyDelete
 8. నేను చెప్దామనుకున్న మాట విజయమోహన్ గారు చెప్పేశారు.

  ReplyDelete
 9. పాత కాలంలో అంటె 1970ల వరకూ కూడ సినిమా హాళ్ళల్లో సినిమా అన్ని ఆటలు అయినాక జాతీయ గీతం తప్పనిసరిగా జెండా ఎగురుతూ ఉండగా బాక్ గ్రౌండ్ లొ జాతీయ గీతం శాస్త్రోక్తంగా వస్తూ ఉన్న ఫిల్ము వేసి తీరాలి. కాని రాను రాను , జండా బొమ్మ జాతీయ గీతం వస్తుండగానే గౌరవంగా నుల్చునే వ్యక్తులను వేళ్ళ మీద లెక్కబెట్టవలిసిన పరిస్థితి, మిగిలిన వాళ్ళు గొర్రెలమందలాగ అలా గౌరవంగా నుంచున్న వాళ్ళను తోసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ (అడ్డoగా నుంచున్నందుకు) విసుక్కుంటూ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చూసి ప్రభుత్వం, ఇలా రోజూ మూడు ఆటలు, ఆదివారాలు పండుగలకు నాలుగాటల చొప్పున జాతీయ గీతo, జెండా అవమానించబడటాన్ని చూడలేక, భరించలేక, జెండాను గౌరవించలేని జాతిని శిక్షించలేక, అలా జండా చూపిస్తూ జాతీయ గీతాన్ని వినిపించటం కంపల్సరీ కాదు అని ప్రకటించారు. సినిమా హాళ్ళ వాళ్ళు ఆ జండా రీళ్ళన్ని "హమ్మయ్య" అని ఆవతల పారేశారు.

  ఇప్పుడు కూడ చూడండి, జాతీయ గీతన్ని, సినిమా మొదట్లోనే చూపిస్తుంటారు కొన్ని హాళ్ళల్లో. ఎందుకూ? ప్రేక్షకుడు సినిమా చూడాలి కదా, వెళ్ళిపోడు అందుకని. ఇప్పటికి కూడ సినిమా ఐపొయ్యాక జండాను, జాతీయ గీతన్ని చూపిస్తే ఎంతమంది నుంచును ఉంటారు. పైగా ఇప్పుడు వచ్చే బేవార్సు సినిమాలకు వచ్చే ప్రేక్షకులకు జాతీయ గీతమేదో కూడా తెలియదాయె మరి.

  చాలా రోజుల క్రితం, నేను ఈ విషయంలో ఒక చిన్న వ్యాసం వీడియోతొ సహా వ్రాశాను. ఈ కింది లింకు నొక్కి చూడండి.


  http://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_25.html


  ఇదే విధంగా ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని అయిపోయినాక, రాత్రి పదిన్నర కు ప్రసారాలు జాతీయ గీత ఆలాపనతో అంతమయ్యేవి. కాని అక్కడ కూడ ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది, ప్రజలు ఎటువంటి స్థితిలో ఉండి ఈ జాతీయ గీతం వింటున్నారో కదా, అలా వింటూ నుంచుని గౌరవించ గలిగిన స్థితిలో ఉంటారో లేదో , అసలే జనభా తెగ పెరిగి పోతొంది, వాళ్ళను డిస్టర్బ్ చెయ్యటం దేనికి , అని అలా జాతీయ గీతాన్ని రోజూ వీనిపించటాన్ని కూడ 1970లలోనే మానుకున్నారు.

  ReplyDelete
 10. ఈ అంశంపై విలువైన విషయాలు పంచుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
  శివరామ ప్రసాద్ గారూ మీరు లింక్ ఇచ్చిన విడియో గొప్పగా ఉంది.
  http://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_25.html

  ReplyDelete
 11. హైదరాబాదులో కొన్ని థియేటర్లలో ఈ సంప్రదాయం ఉంది. మియాపూర్ లోని టాకీ టౌన్ థియేటర్ కాంప్లెక్స్ లో సినిమా ప్రారంభానికి ముందు భరత్ బాల ప్రొడక్షన్స్ వాళ్ళ "జనగణమన" వీడియో వేస్తారు.

  ReplyDelete