Wednesday, April 27, 2011

సినిమా థియేటర్లో జాతీయగీతం






మొన్నామధ్య మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి వెళ్ళాను. ప్రారంభానికి ముందు వేసే యాడ్స్ అన్నీ అయిపోయాక ఒక స్లైడ్ పడింది. జాతీయగీతం వస్తోంది లేచి నిలబడండి అని. ఒక్కసారిగా ప్రేక్షకులందరూ లేచి నిలబడ్డారు. పిన్ డ్రాప్ సైలెన్స్. కేవలం మ్యూజిక్ నేపథ్యంలో మానసిక, అంగ వైకల్యం ఉన్నవారిపై జాతీయ గీతాన్ని చిత్రీకరించారు. చాలా చాలా గొప్పగా ఉంది. అయిపోతూనే చాలాసేపు ఈలలు కేకలు మారు మోగాయి. నాకైతే కళ్ళల్లో నీళ్ళు నిండాయి.


అన్ని వర్గాల వారు వచ్చే సినిమా థియేటర్లలో జాతీయ గీతం చూపడం గొప్ప కాన్సెప్ట్ అనిపించింది. ఇది కేవలం రిలయన్స్ బిగ్ సినిమాల్లో ఉందని మిత్రులు చెప్పారు. దీన్ని అన్ని చోట్లా అమలు పరిస్తే బావుంటుంది.