Thursday, October 7, 2010

ఖలేజా బావుంది



సినిమా మొత్తం ఫుల్ లెంగ్త్ కామెడీ అని ఏదో బ్లాగులో చదివాను. అయితే అంతగా అనిపించలేదు. త్రివిక్రం పాత సినిమాలతో పోలిస్తే ఇందులో కామెడీ తక్కువే. 


అతడు, పోకిరిల్లో లాగా కాకుండా మహేష్ బాబును సీరియస్ షేడ్ నుంచి తప్పించాడు దర్శకుడు. మహేష్ నటన కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. పాటలకు మణిశర్మ న్యాయం చేయలేకపోయాడు. 


జల్సా, మగధీర ప్రభావం కొన్ని సీన్లలో కనిపిస్తుంది. సెకెండ్ హాఫ్ లో మహేష్ లో దేవుడి అంశ ఉంది అన్న విషయం తెలుస్తుంది. అయితే ఈ అంశం మీద ప్రేక్షకుడు ఏ సెటైర్లు వేస్తాడో వాటిని డైరెక్టుగా మహేస్ చేతే చెప్పించారు. ఆ సీన్లు పండడమే కాకుండా, ప్రేక్షకుడిని కన్విన్స్ చేయడంలో సఫలం అయ్యారు. 


మల్లీశ్వరి లాగా కామెడి పాలు ఇంకాస్త ఎక్కువ అయి ఉంటే ఇంకా బావుండేది. 


దేవుడంటే ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎదుటి వాడికి సహాయం చేయాలని నీవు బలంగా సంకల్పిస్తే అందుకు తగ్గ అవకాశం నీకు తప్పక లభిస్తుంది అదే దైవత్వం అని చెబుతాడు. 


మొత్తానికి సినిమా బావుంది. మరీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయి కాదు. కానీ ఒకటికి రెండు సార్లు చూసినా బోర్ కొట్టదు.

3 comments:

  1. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఉండే అవకాశం ఉంది అంటునారు

    ReplyDelete
  2. ఇందులో దైవాంశలూ కూడానా. అయితే ఆలోవించాల్సిందే

    ReplyDelete
  3. @ శీను గారు
    నిజమే. ఎక్కడో ఒక చోట మినహాయించి అశ్లీలత లేదు, హాయిగా చూడొచ్చు.

    @ మినర్వా గారు
    అప్పుడప్పుడు కాస్త ఎబ్బెట్టు అనిపిస్తుంది కానీ పూర్తిగా ఇబ్బంది కలిగించదు.

    ReplyDelete