Friday, August 6, 2010

మా రూమ్మేటు - నక్సలైటుశరత్ గారు రాసిన పోస్టు చదివాక నాకు ఇది గుర్తుకు వచ్చింది. ఒకసారి నక్సలైటు నాయకురాలు వారి ఇంటికి వెళ్లారట అది ఆయన పోస్టు సారాంశం.సరే నా అనుభవం చెప్తాను. 1993 లో అనంతపురంలో డిగ్రీ చేస్తున్నప్పటి కథ. కొందరం మిత్రులం కలసి కోర్టు రోడ్డులో రూంలో వుండే వాళ్ళం. బ్యాచిలర్ రూములంటే ప్రతి రోజూ ఎవరో ఒకరి ఫ్రెండ్ రావడం మామూలే కదా. కొన్నాళ్ళకు వాళ్ళు కూడా మనకు మంచి మిత్రులైపోతారు. మా రూమ్మేటు ఆది కేశవయ్య అని ఉండేవాడు. ఆయన మిత్రుడు సోమలా నాయక్ ( ఒక వేళ పేరు కొంచెం తేడ వుండొచ్చేమో, కానీ నాయక్ అన్నది కరెక్టే ) తరచుగా రూంకు వస్తుండేవాడు. వయసులో కాస్త పెద్దవాడు కావడంతో మేము అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఎప్పుడూ నీటుగా టక్ చేసుకుని, బూట్లు వేసుకుని హుందాగా ఉండేవాడు. వెంట ఒక బ్యాగు తప్పకుండా వుండేది. ఒకటి రెండు రోజులు ఉండేవాడు. అందరం కలిసి భోంచేసేవాళ్ళం. ( మాకు అదో మంచి అలవాటు ఉండేది, రూమ్మేట్లు అందరం వచ్చాక మాత్రమే భోజనం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ రోజు ముందే చెప్పేవారు, తాము భోజనానికి రావడం లేట్ అవుతుంది మీరు లాగించేయండని. )


తర్వాతి సంవత్సరం మేము రూము మారాము. సోమలా నాయక్ చాలా రోజుల్నుంచి రావడం లేదు ఏమయ్యాడు అని ఆది కేశవయ్యను అడిగాము. ఈ మధ్య పోలీసుల నిఘా ఎక్కువైందని ఆది చటుక్కున నోరు జారాడు.


మావాళ్ళు ఠక్కున అటెన్షన్ లోకి అతన్ని పీడించి విషయం లాగేశారు. సోమలా నక్సలైటు అని, బ్యాగులో గన్ ఎప్పుడూ ఉండేదని చల్లగా చెప్పాడు. అంతే అందరం కలిసి ఆదిని సోమలాను మించిన ఉగ్రవాదిగా చూసి నానా తిట్లు తిట్టాము. ఇంకోసారి సోమలా రూంకు వస్తే నిన్ను కూడా తన్ని తగలేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చాము. ఆ తర్వాత మరెప్పుడూ సోమలాను మేము చూడలేదు. అది అక్కదితో ముగిసింది.

నేను డిగ్రీ బి.ఈడీ పూర్తి చేసి తర్వాత 1997లో ఈనాడు జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ పొందుతున్న కాలం. సాయంత్రం క్లాస్ అయిపోగానే లైబ్రరీకి పరిగెత్తేవాళ్ళం జిల్లా ఎడిషన్ చూడటానికి. మన జిల్లాలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలన్న ఉత్సాహం. ఇప్పటిలా మొత్తం పేపర్లన్నీ ఒకచోట చూసే వీలు అప్పుదు లేదు. జిల్లా ఎడిషన్ రెండు రోజులు ఆలస్యంగా లైబ్రరీకి వచ్చేది. ఒకరోజు పేపర్లో నక్సల్ ఎంకౌంటర్ అని వార్త వచ్చింది. ఇన్ సెట్ లో ఫోటో చూసి ఎక్కడో చూసామే అనుకుంటూ వార్త లోకి వెళ్ళాను. కొన్ని క్షణాలకు గుర్తుకు వచ్చింది, మన ఆది ఫ్రెండని.


ఆయన మార్గం, వ్యవహారాలు మంచివో చెడో నాకైతే తెలీదు కానీ ఎంకౌంటర్ మరణం అనేది బాధ కలిగించింది.

5 comments:

 1. mee chivari vaakyaalu maaku baadha kaliginchaayi..

  ReplyDelete
 2. నాకు నక్సలైట్లతో ఇంకో అనుభవం కూడా వుంది. నాకోసం మా ఊర్లో వెతికారు. నన్ను ఇక్కడ నుండి పిలిపించి తన్నాలని చూసారు కానీ అది ఆసక్తికరమయిన ట్విస్ట్ తిరిగింది. ఆ ఘనకార్యం కూడా వ్రాయాలి కానీ ఎక్కడ - ఈమధ్య నేను స్త్రీ బ్లాగర్ల వెంటపడటం - వారు నాకు క్లాసులు పీకడం - నేను ఏడవలేక నవ్వడం తోనే సరిపోతోంది.

  ReplyDelete
 3. సమాజ ద్రోహి కుక్కచావు సచ్చాడు. మీరు నిర్భయంగా వుండండి.

  ReplyDelete
 4. కెక్యూబ్ గారూ ఏ రకంగా బాధ కలిగించాయి ? వేరే వాళ్లయితే అడిగేవాడిని కాను కానీ మీరు కాబట్టి అడుగుతున్నాను?

  ముందుగా మీ ఫోటో సూపరండీ. ఎక్కడ కనిపించినా నవ్వుకుంటూనే ఉన్నాను. మీ క్రియేటివిటీకి ఒక్కోసారి ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది.
  కొంపదీసి వాళ్ళనుంచి తప్పించుకుని గానీ కెనడా వెళ్ళారా? :))

  అఙ్ఞాత గారూ మనకు భయం ఎందుకులెండి. మన జోలికి వచ్చే స్థాయిలో కూడా మనం లేము.

  ReplyDelete
 5. mmm....papam...

  i agree with ur last 2 lines....very sad....papam edo cheddamane avesamlo velli vuntaaru.

  ReplyDelete