Monday, May 31, 2010

ఎవరండీ ఈ వీఐపీలు???



మంత్రులు, ఇంకా ఎవారైనా వీఐపీలు వస్తూ వెళ్తూ ట్రాఫిక్ పరంగా ఎంతో ఇబ్బంది కలుగజేస్తుంటారు. ప్రజలు వారికోసం ఆగాలి. వాళ్ళు ఓ మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుండగానే ఈ హడావిడి మొదలు. హైదరాబాద్ వాళ్లూ అలవాటుపడిపోయి ఉండొచ్చు. కానీ అనంతపురంలో నెలకు ఒకటి రెండుసార్లు అదీ ఓ 5 నిముషాల పాటు ఎక్కడైనా ట్రాఫిక్ ఆగవచ్చు. అలాంటిది నిన్న పోలీసులు చేసిన హడావిడికి జనాలు బండ బూతులు తిట్టుకున్నారు. ఈ రోజు ఇక్కడ సీఎం కార్యక్రమం ఉంది. అందుకు పోలీసులు ట్రయల్ రన్ వేశారు. అనంతపురం వృత్తాకారంగా విస్తరించివుడటం వల్ల పట్టణ పరిధి చాలా తక్కువే. అసలు ట్రయల్ రన్ అంత సీన్ లేదు. కానీ మన వాళ్ళేమో సీఎం కాదుకదా పీఎం ఏకంగా వచ్చేసి వీధుల్లొ నడుస్తున్న  బిల్డప్ ఇచ్చారు. 


ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు. బైక్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినపుడు కొన్ని ఆణిముత్యాలు వెలువడ్డాయి ప్రజల నోటి నుంచి అవి...


" ఈ నా కొడుకులకు వోటు వెసేది మనం, గెలిపించేది మనం, ఇబ్బంది పడేది మనం. ఓటేసి మనం వాయించుకున్నట్లు ఉంది ( నిజానికి ఇక్కడ ఒక బండ బూతు పడింది ) "


" జనాల సొమ్ము లక్షలకు లక్షలు సంకనాకిస్తున్నారు... ( బూతు )"


" రోశయ్యకు ఇంత  అవసరమా? "


" పోలీసులు ఈ రోజు  హడావిడి చేస్తారు, రేపు అసలు టైంలో కాన్వాయ్ లోకి పిల్లి కూన కూడా దూరగలదు " 


ఇలా జనాలు అసహనాన్ని ప్రదర్శించారు. 


నిజమే వీళ్ళందరికీ ఆ వీఐపీ స్టేటస్ ఎలా వచ్చింది? ప్రజలతోనే కదా ?


ప్రాణ హాని వున్నవాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతిదానికీ లిమిట్ ఉంటుంది కదా? చివరకు ట్రాఫిక్ ఆపి వీళ్ళు దర్జాగా పోవడం ఒక స్టేటస్ సింబల్ కూడా అయిందేమో! కొన్ని దేశాల్లో వీఐపీలు క్యూలో నుంచున్నారని వార్త చదివినపుడల్లా నాకు ఎంతో ముచ్చట వేస్తుంటుంది. వాళ్ళు అలవర్చుకున్న సంస్కారానికి సంతోషం కలుగుతుంది. 


ఇక ఈ ఇరిటేషన్ను అసహ్యకరంగా, జీర్ణించుకోలేకుండా చేసిన ఘనత మాత్రం ప్రస్తుత టీటీడీ పాలక మండలి. 


అయినా అనుభవించాల్సిందే. తిట్టుకోవాల్సిందే. మరచిపోవాల్సిందే. 


ఈ టపాకు ముక్తాయింపుగా కార్తీక్ రాసిన చక్కటి టపాను ఒకసారి చదవండి. 


http://nenu-naa-svagatam.blogspot.com

5 comments:

  1. మీరు రాయని బూతులు నాకు తెలిసిపోయాయోచ్..ఎంతైనా నేనూ సీమబిడ్డనే కదా ;)
    మొన్న ఎలక్షన్లప్పుడు చిరంజీవి కడపకు వచ్చాడు. పోలీసులు చాలా రోడ్లు మూసేశారు.. వాటిలో రైల్వే స్టేషన్ రోడ్ కూడా ఉంది.. రైలు దిగి ఊర్లోకి వెళ్ళాలనుకున్న ప్రజలు నానా కష్టాలు పడి బయట పడ్డారు. ముసలి ముతక ప్రజలకు వాళ్ళ రెండు మూడు తరాల పూర్వీకులు కనిపించారు.. నేను మా అత్తను రిసీవ్ చేసుకుందామని వెళ్ళటం వల్ల ఇవంతా గమనించాను..

    నా టపా లింక్ ఇచ్చినందుకు నెనర్లు

    ReplyDelete
  2. mmmmm....ade rosaiiah ki emina ithe inko tapa vestav tidutoo antega neeku telisindi.....dont criticize everything.

    ReplyDelete
  3. అదేనండీ ప్రజల ప్రాణాలకు, జీవితాలకు, సమయాలకు విలువ లేదు. ఆ నిలిచిపోయిన వాహనాల్లో ఎవరు ఎంత ప్రాణం మీదకు వచ్చిన వాళ్ళు ఉంటారో? వారి హడావిడికి ఒక హద్దు ఉండాలి అని నేను చెబుతోంది. 20, 25 వాహనాల సెక్యూరిటీతో ఒక నాయకుడు ఊరెగుతున్నాడంటే వాడు ప్రజలకు ఎంత దూరం అయ్యుంటాడు? ఎవరికోసం వారు పనిచేస్తున్నట్లు?

    మరి విమర్శలు ఎలాంటివాటిమీద చెయ్యాలో చెప్పండి, నాకు తెలిసింది చాలా తక్కువ. నా మెదడు చిన్నది.

    ReplyDelete
  4. ఈనాడు 97 బ్యాచ్ ప్రసాదే అనుకుంటున్నా. నేను ఖమ్మం శ్రీనివాస్ ను. జనరల్ డెస్క్ లో ఉన్నా. srinivas .bodlapati @gmail .com . 9949610330 . ఎలా ఉన్నావ్. వివరాలేంటి.

    ReplyDelete