Saturday, May 29, 2010

వెంటాడిన దెయ్యం!!

ఇది మా మిత్రుడికి జరిగిన ఘటన. చాలా సంవత్సరాల కిందట ఈ ప్రపంచం ఇంత స్పీడు లేని కాలం. అతను కర్నూల్ లో చదివేవాడు. అనంతపురం అర్జెంటుగా రావలసి వచ్చింది. రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఏదో ప్రైవేటు వాహనంలో వచ్చాడు. అది టౌనుకు దూరం నుంచి పొయే బైపాస్ రోడ్ లో వదిలింది. అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు వాళ్ల ఇల్లు. నడక మొదలుపెట్టాడు. 


దిగినచోటు ఒక చిన్న కాలనీ లాగా ఉంటుంది. అది దాటిన తర్వాత అంతా నిర్మానుష్యమే. మనవాడు నడక సాగిస్తున్నాడు. కాలనీలో వెలుగుతున్న లైట్లు అంతోఇంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఎప్పుడో ఒక సారిగానీ అరకొర వాహనాలు పొతున్నాయి. ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా ఒక పక్క గుబులు గుబులుగా ఉంది. లైట్లు దూరం అయిపోయాయి. చీకటి పరచుకుంది. చెట్లలోంచి కీచురాళ్ల అరుపులు, దూరంగా కుక్కల అరుపులు ఇలా బ్యాక్ గ్రౌండ్ మొదలైంది. మన వాడిలో అంతవరకు ఉన్న ధైర్యం నీరుగారుతూ వచ్చింది.  


అప్పుడు వినిపించింది చూడండి గజ్జెల లాంటి శబ్దం. ఇతగాడి గుండె ఝల్లుమనింది. ఆంజనేయ దండకం చదువుతూ కొంచెం వేగంగా నడిచాడు. శబ్దం మరింత ఎక్కువ అయింది. చెమట్లు పట్టేశాయి. చుట్టూ నరమానవుడు లేడు. ఏమి చేయడానికి లేదు. ఇక పరుగు మొదలు పెట్టాడు. ఈ సారి తన వెనుకనే తన మీదనే గజ్జెలు చప్పుడు చేస్తున్న ఫీలింగ్. ఆయాసం వచ్చే వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. గజ్జెల శబ్దం వెంటాడుతూనే ఉంది. ఈ లోపు దూరంగా టౌనులో లైట్లు కనబడుతున్నాయి. పరిగెత్తుతున్న వాడల్లా టక్కున ఆగాడు. గజ్జెల శబ్దం కూడా ఆగి పోయింది.  


పరిగెత్తడం ఆగడం ఇలా చేస్తూనే ఇంటివరకు వచ్చాడు. అప్పటివరకూ శబ్దం కూడా అతన్ని వెంబడిస్తూనే ఉంది. గుండె దడతోనే బ్యాగు తీసి ఆవల విసిరేసి అరకొరగా నిద్రపోయాడు. 
పొద్దున లేస్తూనే రాత్రి సన్నివేశమే కళ్ళ ముందు మెదిలింది. జీవితంలో మొదటి సారి దెయ్యాన్ని ఎదుర్కున్నానని అలోచిస్తూ బ్యాగులోని బట్టలు, పుస్తకాలు తీసి బయటపెట్టాడు.


అడుగున గ్లాస్ సీసా ఉంది. హార్లిక్స్ లాంటివి వస్తాయే అది. ఈ సీసాల్లొనే గన్ పౌడర్ నిలువ చేసేది. గన్ పౌడర్ అంటే వేరుశెనగ విత్తనాలతో తయారు చేసిన పొడి. రాయలసీమ విద్యార్థులకు ఇది లేనిదే ముద్ద దిగదు. ఇంటికి వచ్చినపుడు అమ్మ సీసా నిండా పొడి వేసిస్తే మళ్ళీ ఊరికి వెళ్ళే దాకా దాన్ని రోజూ ఇంత ప్రసాదంలా అన్నంలో తినేవాళ్ళం. ఈ పొడి సీమ ప్రజలకు ఆరో ప్రాణం అనుకోండి.  సరే మన మిత్రుడు ఖాళీ సీసాను తీసుకుని తేరిపార చూశాడు. ఆ ఖాళీ సీసాలో ఒక స్పూన్ కనబడింది. ( పొడి వేసుకోడానికి అందులో ఒక స్పూన్ వేయడం రివాజు )

13 comments:

 1. anatapuram lO meeru yekkaduntaaru?

  Meeru cheppina by-pass road pakkana vunna colony lo memu 25 years vunnamu. Ippatikee maa illu akkadundi

  ReplyDelete
 2. ఈ పొడి సీమ ప్రజలకు ఆరో ప్రాణం అనుకోండి.
  200% correct!

  ReplyDelete
 3. అఙ్ఞాత గారూ,

  నేను ఉండేది విజయనగర్ కాలనీ, కలెక్టర్ ఆఫీసు తర్వాత.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. కార్తీక్ గారూ,

  నిజమే. మేము డిగ్రీ చదివే రోజుల్లో కూరలు బయట తెచ్చుకుని గడిపేవాళ్ళం. ఇక్కడ కొన్ని హోటళ్ళలో గడ్డీ గాదం వేసి ఆకుకూర పప్పు ముసుగులో అమ్మేవారు. గడ్డి పోచలు పక్కన వేసి మిగతా పప్పు తినాల్సి వచ్చేది. ఆకు కూరలకు కట్టిన గడ్డి పోచను కనీసం తీసేవారు కాదు వెధవలు. అప్పుడు మనకు గన్ పౌడరే దిక్కు. మా ఇంట్లో కారం తక్కువ తినేవాళ్లు. నేను పొడి తెచిన మరసటి రోజే మా క్లాస్ మేట్లు వచ్చి ఉట్టిది తిని వెళ్ళేవారు. కాకపోతే మా రూమ్మేట్లు తలా ఒక సీసా తెస్తారు కాబట్టి సర్దుకుపోయేవాళ్ళం.

  ReplyDelete
 6. నేనూ అంతే నండీ ప్రసాద్ గారూ.. మా అమ్మ మొన్న కూడా ఒక డబ్బా నిండుగా పెట్టించింది.. ఇప్పుడున్న మా నేపాలీ వంట వాడు బాగానే వండుతాడు.. కానీ ఎంతైనా మన సీమ రుచులు మరిగిన నాలుక కదండీ కాబట్టి గన్ పౌడర్ ఉండాల్సిందే.. కాన్ పూర్ లో ఉన్నప్పుడు కూడా రెండు పచ్చళ్ళు రెండు పొళ్ళు ఎప్పుడూ స్టాక్ ఉండేవి నా దగ్గర.. మా అమ్మ పేట్టే టొమాటో పచ్చడి మా హాస్టల్ లో చాలా ఫేమస్ కానీ ఎక్కువ నిలువ ఉండేది కాదు.

  ReplyDelete
 7. బాగుంది..గజ్జెల శబ్ధం కాబట్టి..తరుముకోచ్చింది ఆడ దెయ్యం అనమాట..దెయ్యాల్ని ఎప్పుడు ఆడవాళ్ళ లానే చెపుతారు..చూపిస్తారు..కామిని సంకిని లంకిణి..ఇలా అనమాట..మగవాళ్ళని పెద్దగా దయ్యాలు ఎవ్వరూ చెప్పడం..చూపడం వినలే...దీన్ని బట్టి ఏంటయ్యా అంటే..ఆడవాళ్ళ అంతా దెయ్యాలు (హా హా...సరదాకి)...

  ReplyDelete
 8. baagundi..gajjela motaa..
  @kiShan,
  hammaa.....aaDavvallu Ekam kandi..ikkaDa anEsi (saradaki) antunnaru..aadaaLLu deyyalanta!!

  ReplyDelete
 9. కిషన్ రెడ్డి గారూ,

  వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. :)

  సుభద్ర గారూ ధన్యవాదాలు.

  ReplyDelete
 10. ఆడాళ్ళు సచ్చాక కూడా దయ్యాలై పీడిస్తారు, మగ వాళ్ళు కొందరు బ్రతికుండగానే ఆపని చేస్తారు, అదీ తేడా!
  గన్ పౌడర్ - ఇలా ప్రతి దానికి కోస్తా వాళ్ళను అనుకరించడం రాయలసీమ వాళ్ళకి ఫేషనైపోయింది. కోస్తా వాళ్ళు ఆపేరును పేటెంట్ చేసుకోవాలి. ఇలా పల్లీలు, పుట్నాల పొడులకి ఆ పేరు వాడేస్తే దాని ప్రాశస్థ్యం , ప్రాముఖ్యము, సంస్కృతి , సాంప్రదాయము వగైరా వగైరాలు ఏమైపోవాలి?

  ReplyDelete
 11. అఙ్ఞాత గారూ,

  మరెందుకాలస్యం పేటెంట్ చేసేయండి. :)

  ReplyDelete