Thursday, May 27, 2010

దయచేసి నా కొత్త బ్లాగును ఒకసారి సందర్శించండి
మిత్రులారా అందరికీ నమస్కారం,

ముందుగా నన్ను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు ఎస్వీ.ప్రసాద్. నేను ఉపాధ్యాయుడిని. నేను జీవని స్వచ్చంద సంస్థ  http://jeevani2009.blogspot.com/     కోసం పనిచేస్తున్నాను. జీవని బ్లాగ్ పూర్తిగా సేవా దృక్పథంతో కొనసాగుతుంది. దాన్ని పూర్తి వివాదరహితంగా నడుపుతున్నాము.  ఈ క్రమంలో నా సొంత ఆక్రోశం, అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే దీన్ని క్రియేట్ చేశాను.

దయచేసి ఒక్క విషయాన్ని గమనించండి. నా అభిప్రాయలతో జీవని బ్లాగ్ కు ఎలాంటి సంబంధం లేదు. మామూలుగా నేను కూడా ఎవరినీ నొప్పించను. సాధుజీవినే. ఒక వేళ ఖర్మగాలి ఎవరైనా ఇబ్బంది పడినా ఆ ప్రభావాన్ని జీవని మీద చూపించవద్దని, నా గోడు వెళ్లబోసుకోడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను.

22 comments:

 1. ప్రసాద్ గారు , రెండు బ్లాగులు ఉండడం మంచిదే కానీ సమాజ సేవ చేస్తున్నాం కదా అని మన వ్యక్తిగత అభిప్రాయాలని వెలిబుచ్చడం మానుకోలెం కదా?

  ReplyDelete
 2. శ్రీనివాస్ గారూ,

  మొదటి కామెంటు మీదే కావడం, నాకు చాలా సంతోషం. మీరు చెప్పింది నిజమే. కాకపోతే మన అభిప్రాయాలు చూసి ఆర్గనైజేషన్ మీద ఎక్కడ నెగటివ్గా ఆలోచిస్తారో అని భయం. ఆ ప్రభావం ఉంటుంది అని నా నమ్మకం.
  ఇక పోతే నాకు మీ అంత దూకుడు,నిర్మొహమాటం లేవు. :))
  అందుకే ఇలా...

  ReplyDelete
 3. orginisation gurinchi yenduku chepparu...
  teacher annaru kada. akkaditho apalsindi...
  melo konchaem swardham undi...

  ReplyDelete
 4. నక్షత్ర గారూ,

  :))
  నాకు ఎలాంటి స్వార్థాలూ లేవు. నేను స్వార్థాన్ని జయించానని పూర్తి విశ్వాసంతో చెప్పగలను. ఈ టపాలో నా సమస్య చెప్పడానికే జీవని ని రెఫర్ చేశాను. బహుశా మీరు బ్లాగులకు కొత్త అయి ఉండవచ్చు. జీవని కోసం నేను పనిచేస్తున్న విషయం బ్లాగు మిత్రులకు తెలుసు. వారికి క్లారిఫికేషన్ ఇవ్వడానికే జీవని పదం వాడాను.
  ధన్యవాదాలు.

  ReplyDelete
 5. prasadji..namaste
  one man can't work in many ways..personally.organisationally,homly,etc...onehas only one mode of charecter. don't be call for in tow way modes. go head with JEEVANI u will be a greatfull one. u are great u are organising a NGO. "real happiness lies in helping others" by meher baba. ji swasti.

  ReplyDelete
 6. మీరు చెప్పింది కరక్టే, కానీ దీని వల్ల జీవనికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు కదా? నిజానికి ప్రసాదం బ్లాగులో నిత్య జీవితంలో జరిగే మంచి సన్నివేశాల గురించి రాయాలన్నది నా కోరిక. ఎన్నో ఘటనలు మెదడు రికార్డుల్లో లేకుండా పోయాయి. ముఖ్యంగా హాస్య ఘట్టాలు. మా మిత్ర బృందం అందరూ హాస్య ప్రియులే. అవి మరుగునపడిపోకుండా ఇక్కడ రికార్డు చేస్తాను.

  "real happiness lies in helping others" by meher baba.

  దీన్ని నేను కూడా మనస వాచా నమ్ముతాను.

  ధన్యవాదాలు.

  ReplyDelete
 7. ఇంకెందుకాలస్యం. మొదలుపెట్టండి.

  ReplyDelete
 8. ఏక లింగం గారూ,

  ధన్యవాదాలు. పనిలో పని, మీపై శరత్ గారు ఒక అభాండం వేశారు. ఒకసారి ఆయన్ని నిలదీయండి.

  శరత్ 'కాలమ్' said...
  ఏకలింగానికి భూతవిద్యల్లో కాస్త అనుభవం వుందనుకుంటా. ఆయన్ని కాంటాక్ట్ చేద్దాం :))

  https://www.blogger.com/comment.g?blogID=6785438692596160184&postID=4568918211681687615&pli=1

  May 13, 2010 10:21 PM

  ReplyDelete
 9. హహ... అది అప్పుడే చూసాను.

  మొదటగా ఆయనపైనే చేతాబడి చేద్దాం అనుకుంటున్నాను. :)

  ReplyDelete
 10. :)))))

  శరత్ గారూ బీ కేర్ ఫుల్ !

  ReplyDelete
 11. ఈ సారి ఇండియా వెళ్ళేటప్పుడు లండనులో ఏకలింగం గారి నట్టింటికొస్తాను. ఎవరు ఎవరికి (చేతబడి) చేస్తారో చూద్దాం :))

  మీకోసమంటూ వేరే బ్లాగు పెట్టడం మంచి నిర్ణయం. నేనే మీకు సజెస్ట్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటూనేవున్నాను. ఒక సేవా సంస్థ పేరుతొ వున్నప్పుడు హుందాగా వుండాల్సి వుంటుంది. సరదాగా, చిలిపిగా, ఇంకా వేరేగా, వ్యక్తిగత భావాలు అక్కడ ప్రస్ఫుటిస్తే ఆ సంస్థకి శోభించదు. ఆ ప్రభావం తప్పకుండా వుంటుంది.

  ReplyDelete
 12. మంచి ప్రయత్నం బావుంది. కొనసాగించండి....

  ReplyDelete
 13. శరత్ గారూ,

  ఏకలింగం గారికి ఈ హెచ్చరిక విత్ తొడలా, వితౌట్ తొడలా? ఈ మధ్య ఇదొక పెద్ద చిక్కుగా మారింది. ప్రతిదానికి తొడలు కొట్టారా లేదా అని క్లారిఫై చేసుకోవాల్సి వస్తోంది.

  ఇక బ్లాగు విషయం. దీనికి స్పూర్తి మీ బ్లాగులే. మీ శైలి మల్లిక్ శైలికి దగ్గరగా కనిపిస్తుంది. నాకు మల్లిక్ అబ్సర్డ్ శైలి అంటే చాలా ఇష్టం. నేను అలాంటి కథలు రాసినపుడు ముందుగా మల్లిక్ కథలు చదివేవాడిని. అలాగే వ్యంగ్యం రాసేటపుడు తోలేటి జగన్మోహన్, పతంజలి, జి.ఆర్.మహర్షి గారి కథలు చదివేవాడిని. అలాంటి నేను జీవని వల్ల రాతల వరకు చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. మీరేమో పిల్లి కూన మొదలుకుని పిశాచాల వరకు అలవోకగా రాసేస్తుంటే నాకు కొంత అసూయ :) కలిగిన మాట వాస్తవం. చివరాఖరికి కడుపుబ్బరం తట్టుకోలేక కొత్త బ్లాగు పెట్టాను.

  ReplyDelete
 14. ధరణీ గారూ ధన్యవాదాలు.

  ReplyDelete
 15. శుభం....ఏసేయ్ దానెక్క....ఐతే అయింది

  ReplyDelete
 16. ప్రసాద్ గారు,
  మీ గురించి బ్లాగు మిత్రుల ద్వారా విన్నాను. చాలా మంచి పని చేస్తున్నారు. మంచి చెయ్యాలన్న మీ సదుద్దేశ్యం పట్ల నాకు గౌరవం వుంది , కాని నాకున్న సందేహం మీతొ పంచుకోవడానికి ఆ గౌరవం అడ్డం కాదు అనుకుంటాను.
  అసలు సంఘసేవ సంఘం లో వెనకబడిన వారి కోసం కదా! వ్యాధికి ప్రధమ చికిత్స లాంటిదే కదా అది. సంఘంలో కొంతమంది వెనకబడి వుండడం అన్నది వ్యాధి . మరి ఆ వ్యాధికి అసలు చికిత్స ఏమిటి? మనం దానికి ఏమన్నా చేయాగలమా? ఎంత మందికి మనం సంఘసేవ ద్వారా మేలు చేద్దామని చూసినా ఇంకా మిగిలి పోయెవారు వుంటారు కదా! వ్యక్తిగతంగా కాకపోయినా ఒక సంస్థ రూపేణా వ్యాధి మూల కారణానికి ఏమన్నా చెయ్యగలమా?
  ఇది కేవలం నా అనుమానమేనండి. మీ సదుద్దేశ్యం పై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు.

  ReplyDelete
 17. భరద్వాజ, భా.రా.రా. గార్లకు ధన్యవాదాలు.

  క్రిష్ణ గారూ, ఫార్మాలిటీస్ గురించి పక్కన పెట్టండి. ఫ్రీగా మాట్లాడుకుందాం.
  మీ ప్రశ్న నేనూ ఎన్నో సార్లు వేసుకున్నాను, చివరకు ఒక కంక్లూజన్ కు వచ్చాను.
  అసలు పరిధి గురించి మాట్లాడుకుంటే మన శక్తిసామర్థ్యాలు ఎంత? సంఘం అంటే దాని చుట్తుకొలత ఎంత? మన వీధా? ఊరా? మండలమా? జిల్లానా? రాష్ట్రమా? దేశమా? ప్రపంచమా?
  మీరంటున్న వ్యాధికి నా పరిణతి మేరకు కారణాలు చెబుతాను.
  1) ఎవరి పని వారు చేయకపోవడం. మొదటి ముద్దాయిలు రాజకీయ నాయకులు, అధికారులు. వీరు సక్రమంగా పని చేస్తే చాలా వరకు స్ట్రీం లైన్ అవుతాయి.
  2) విద్య, ఆరోగ్య వ్యవస్థల్లో లోపాలు.
  ఈ రెండింటిని చక్కబెడితే అంతా అదే కుదురుకుంటుందని అనుకుంటాను. అసలు స్వచ్చంద సంస్థలు అవసరం ఏంటి? ఇవి ప్రభుత్వాల ఫెయిల్యూర్కు నిదర్శనాలు.

  ఇక మనం చేయగలిగేవి...

  1)అందరం ఎంతోకొంత చేయాలి. నిజంగానే ఈ వెనుకుబడినవారిని ఆదుకోవాలని అనుకుంటే అందుకు పనిచేస్తున్న సంస్థలకు డబ్బు, మానవ వనరులు, నైతిక మద్దతు ఇలా ఏదో ఒక రూపంగా సహాయపడాలి. ప్రతి ఒక్కరికీ ఇది ఒక సామాజిక బాధ్యత కావాలి. నేను దాతలతో మాట్లాడినపుడల్ల ఇదే చెబుతాను. మీరు జీవనికే ఇవాల్సిన అవసరం లేదు, వందలే ఇవ్వాల్సిన్ అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుదైనా, దేనికైనా మీ జీతంలో, జీవితంలో కొంత భాగాన్ని సేవకు కేటాయించండి. ఇలా అందరిలో చైతన్యాన్ని తీసుకురావాలి. అయితే అది అంత ఈజీ కాదు. కానీ జీవని ఉద్దేశ్యాలలో ఇదీ ఒకటి.

  2) పైది జరగాలంటే ముందుగా స్వచ్చంద సంస్థలు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రజల సొమ్ముకు ప్రతి రూపాయికీ జవాబుదారీగా వుండాలి. అపుడే ఈ లింక్ మొత్తం కొనసాగుతుంది.

  3) ఎంతో చేయాలని ఏమీ చేయలేకపోవడం కంటే మన వంతుగా ఏదో ఒకటి చేయాలి. ఆ పరిధి చాలా చిన్నదే కానివ్వండి.

  4) మనం సహాయం చేయడమే కాదు, మన కార్యక్రమాన్ని వారు తిరిగి మరికొందరికి చేయాలి. స్టాలిన్ కాన్సెప్ట్. తర్వాతి తరంలో సేవ చేయడానికి మా జీవిత కాలంలో 100 మంది మెరికల్ని తయారుచేయాలన్నది మా ఉద్దేస్యం.

  ఈ రకంగా లక్షలాది మంది చేసుకుంటూ పోయినా ఇంకా ఇంకా వెనుకబడిన వారు ఉంటారు.

  అయితే ఇలా వ్యక్తిగత స్థాయి నుంచి మూకుమ్మడిగా మార్పు తీసుకురాగల శక్తి తప్పకుండా ఉద్యమాలకు మాత్రమే ఉంది. ఈ ఉద్యమాల్లో పక్కదారి పట్టిపోగా మిగిలేవి కొన్నే, అది దురదృష్టకరం. ఇన్ని రకాలుగా వ్యక్తులు, సంస్థలు, ఉద్యమాలు పోరాటం జరపడం వల్లే వెనకబాటుతనం అంతో ఇంతో తగ్గుతూ పోతుంటుంది. ఇందుకోసం ఈ స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ వీలైనంత కృషి చేయాలి.

  ఈ కంక్లూజన్ తోనే జీవని మొదలుపెట్టాము.

  ReplyDelete
 18. Dear MR.Prasad,
  I wish you all the best. Official blog can't be a platform to register some day to day events/ time to time ideas.
  Wish you good luck
  Ramu

  ReplyDelete